వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు 'వై కేటగిరి' భద్రత

X
వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు 'వై' కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతలనుంచి తనకు ముప్పు ఉందంటూ ఇప్పటికే కొన్ని ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాను ఎంపీగా ఉన్నందున ఢిల్లీ హోకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. వీటన్నింటిని పరిశీలించిన కేంద్రం ఆయనకు 'వై' కేటగిరి
భద్రత కల్పించింది. మాధ్యమానికి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అందినట్టు తెలుస్తోంది. మొత్తం ప్రాసెస్ పూర్తయి సెక్యూరిటీ అందుబాటులోకి వచ్చేందుకు పదిరోజలు పడుతుందని ఎంపీ రఘురామా అన్నారు. ఆగస్టు 15 తరువాత తాను కేంద్ర బలగాలతో సొంత నియోజకవర్గంలో పర్యటిస్తానని అన్నారు.కాగా వై కేటగిరిలో పదకొండు మందితో భద్రత కల్పిస్తుంది కేంద్రం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
