పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉదృతి క్రమంగా పెరుగుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి నదిలోకి భారీగా నీరు చేరుతోంది. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వద్ద బుధవారం 16.50 అడుగుల నీటి మట్టం ఉండగా.. అది గురువారం సాయంత్రం 6 గంటలకు 17.60 అడుగులకు పెరిగింది.

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బుధవారం 10.80 అడుగుల నీటి మట్టం నమోదు కాగా, గురువారం సాయంత్రం 6 గంటలకు 10.90 అడుగులకు పెరిగింది. కాగా గతేడాది ఇదే సమయంలో సముద్రంలోకి దాదాపు మూడు క్యూసెక్కుల వరదనీటిని వదిలారు.

Tags

Next Story