సినీ నటి, ఎంపీ నవనీత్‌కు కరోనా పాజిటివ్

X
అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణా కరోనా భారిన పడ్డారు. బుధవారం ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆమె మామ గంగాధర్ రానా సహా
వారి నివాసంలోని 11 మందికి కరోనా సోకింది. దీంతో మరోవైపు దాదాపు 60 మంది సభ్యులు, కార్యకర్తలకు కూడా కరోనా పరీక్షలు చేసినట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు రావడంతో నవనీత్ కౌర్ ఇంటి ప్రాంగణాన్ని వైద్య ఆరోగ్య శాఖ శానిటైజ్ చేయించింది. కాగా మొదట నవనీత్ రానా, ఆమె భర్త రవిరానా శాంపిల్స్ వైద్యులు తప్పుగా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
