ఏపీలో రెండు లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజూ 10 వేలకు తగ్గకుండా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ లక్షా 96 వేల 789 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో 10,328 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరణాల సంఖ్య కూడా రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. కొత్తగా కరోనా కారణంగా మరో 72 మంది మృతిచెందారు. అనంతపురం జిల్లాలో పది మంది, తూర్పు గోదావరి లో పది మంది,

గుంటూరు లో తొమ్మిది మంది, చిత్తూర్‌ లో ఎనిమిది మంది, కృష్ణ లో ఆరుగురు, నెల్లూరు లో ఆరుగురు, ప్రకాశం లో ఆరుగురు, విశాఖపట్నం లో నలుగురు, కడప లో ముగ్గురు,

విజయనగరంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, కర్నూల్‌ లో ఇద్దరు,

శ్రీకాకుళంలో మరో ఇద్దరు మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,93,894 పాజిటివ్ కేసు లకు గాను..1,09,975 మంది డిశ్చార్జ్ కాగా..1,753 మంది మరణించారు.. ప్రస్తుతం 82,166 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story