ఏపీలో అసలు దిశ చట్టం అమలులో ఉందా..? : చంద్రబాబు

ఏపీలో అసలు దిశ చట్టం అమలులో ఉందా..? : చంద్రబాబు

రాజమండ్రి రూరల్ లో అభం శుభం తెలియని 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు వైసిపి యువకులు అత్యాచారాయత్నాన్ని ఖండించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.

ఈ దారుణానికి పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని.. ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు.

అసలు ఏపీలో దిశచట్టం అమల్లో ఉందా? అని ప్రశ్నించారాయన. 16ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన కళ్లముందే ఉందని.. కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంగ్ రేప్ చేశారని.. ఇప్పటికైనా పోలీసులు నిద్రమత్తు వీడి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story