బీజేపీ ఏపీకి శత్రువు గా మారింది : సిపిఐ నారాయణ

బీజేపీ ఏపీకి శత్రువు గా మారింది : సిపిఐ నారాయణ

ఏపీలో బీజేపీ సపోర్ట్ తోనే మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని కోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. బీజేపీ, గవర్నర్, జగన్ ముగ్గురు కలిసి అమరావతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ ఏపీకి శత్రువుగా మారిపోయిందన్న నారాయణ.. బీజేపీ, వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే సమయం వచ్చిందని అన్నారు. కలిసికట్టుగా పోరాటం చేద్దామని నారాయణ పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story