కాగ్‌గా నియమితులైన గిరీశ్ చంద్ర ముర్ము

కాగ్‌గా నియమితులైన గిరీశ్ చంద్ర ముర్ము
X

జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ గా రాజీనామా చేసిన గిరీశ్ చంద్ర ముర్ము కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ గా నయమితులయ్యారు. కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా గిరీశ్ చంద్ర ముర్ము నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కాగ్ రాజీవ్ మెహ్రీషి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఈ వారంలో పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో రాజీవ్ మెహ్రీషి స్థానంలో ముర్ము బాధ్యతలు స్వీకరించనున్నారు. 1985 బ్యాచ్ కు చెందిన గుజరాత్ కు చెందిన ముర్ము కేంద్ర ఆర్థికశాఖలో వ్యయ విభాగం కార్యదర్శిగా, జమ్మూకశ్మీర్ ఎల్జీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా.. జమ్మూ కశ్మీర్ ఎల్జీగా రాజీనామా చేసిన ముర్ము స్థానంలో మనోజ్ సిన్హా నియమించిన విషయం తెలిసిందే.

Tags

Next Story