మార్కెట్లోకి ఫావిపిరవిర్ 400 ఎంజీ..

మార్కెట్లోకి ఫావిపిరవిర్ 400 ఎంజీ..

కరోనా రోగులకు చికిత్సలో భాగంగా ఉపయోగించే ఫావిపిరవిర్ ఔషధాన్ని గ్లెన్‌మార్క్‌ ఫార్మా తొలుత 200 ఎంజీ డోసుకు తీసుకువచ్చింది. తాజా ఈ ఔషధాన్ని 400 ఎంజీ డోసుల్లో తీసుకువచ్చింది. ఈ మందు వాడిన వారు త్వరగా కోలుకుంటున్నట్లు ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి. కోవిడ్ బాధితులు మొదటి రోజు 9 ట్యాబ్లెట్లు వేసుకోవాలని, ఆ తరువాతి రోజు నుంచి తగ్గేవరకు రోజుకు 4 ట్యాబ్లెట్లు వైద్యుడి సూచన మేరకు వేసుకుంటే సరిపోతుందని గ్లెన్ మార్క్ ఫార్మా పేర్కొంది. 400ఎంజీ డోసుకు మొదటిసారి అనుమతి పొందిన కంపెనీ తమదేనని సంస్థ వివరించింది. ఫాబిఫ్లూ అనే బ్రాండ్ పేరుతో కంపెనీ ఈ ట్యాబ్లెట్లను విక్రయిస్తోంది. తొలుత 200 ఎంజీ డోసును తయారు చేసినా తరువాత రోగుల అవసరార్ధం మేరకు 400 ఎంజీని అభివృద్ధి చేసినట్లు కంపెనీ క్లినకల్ డెవలప్ మెంట్ విభాగం అధిపతి మోనికా టాండన్ అన్నారు. ఈ ఔషధాన్ని తీసుకున్న రోగులు ఏ విధంగా కోలుకుంటున్నారనే అంశాన్ని అధ్యయనం చేయటానికి పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్ స్టడీ చేపట్టినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story