చైనాకు మరో ఎదురుదెబ్బ.. 2500 ఛానళ్లపై ఎఫెక్ట్

చైనాకు మరో ఎదురుదెబ్బ.. 2500 ఛానళ్లపై ఎఫెక్ట్

టెక్ దిగ్గజం గూగుల్ చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. కరోనాకు సంబంధించి తప్పుడు వార్తలు అందిస్తుందన్న ఆరోపణలతో చైనా వరుస ఎదురుదెబ్బలు తింటుంది. తమ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాంపై తప్పుడు సమాచారాన్ని తొలగించే ఉద్దేశంతో చైనాతో ముడిపడి ఉన్న 2500కి పైగా యూట్యూట్ ఛానల్స్ ను తొలగించింది. స్పామ్, వివాదాస్పద వార్తలను ఆ ఛానల్స్ లో ప్రసారం చేస్తున్నారని గూగుల్ తెలిపింది. ఏప్రిల్-జూన్ మాసంలో వీటిని తొలగించినట్టు వెల్లడించింది. చైనా కరోనా వివరాలను సరిగా తెలపడం లేదని ముందునుంచి ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే, చైనా మాత్రం ఈ

ఆరోపణలను మొదట నుంచి ఖండిస్తూ వస్తుంది. తాజాగా.. గూగుల్ తీసుకున్న చర్యలపై.. అమెరికాలో ఉన్న చైనా రాయబా కార్యాలయం ఇంకా స్పందించలేదు.

Tags

Read MoreRead Less
Next Story