రచయిత పరుచూరి ఇంట విషాదం..

రచయిత పరుచూరి ఇంట విషాదం..

టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి విజయలక్ష్మి (74) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. విజయలక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. వీరికి రవీంద్రనాద్, రఘుబాబు అని ఇద్దరు కుమారులు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలందరి సినిమాలకు పరుచూరి బ్రదర్స్ మాటల రచయితలుగా పని చేశారు. ఈ మధ్య వచ్చిన చిరంజీవి చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రానికి కూడా వీరు పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story