భారీ పుస్తకాలు వద్దు.. పిల్లల మనోవికాసం పెంచాలి: ప్రధాని మోదీ

పిల్లలకు సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు అవసరంలేదని.. పిల్లల మనోవికాసం పెంచే సిలబస్ ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. నూతన జాతీయ విద్యావిధానంపై ప్రసంగించిన మోదీ.. ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలని స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానంలో సంచలన మార్పులు తీసుకొచ్చామని.. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. ముప్పై ఏళ్ల తరువాత కొత్తగా జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని అన్నారు. పిల్లలు నచ్చిన కోర్సు చదువుకునే విధంగా మార్పులు చేశామని.. విద్యార్థులకు ఈ విధానం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్పులు తెచ్చామని, ఈ మార్పులు దేశ భవిష్యత్ అవసరమని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానంపై ఆందోళన వద్దని.. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com