వచ్చే వారంలో వ్యాక్సిన్ వచ్చేస్తుంది..

వచ్చే వారంలో వ్యాక్సిన్ వచ్చేస్తుంది..

ఆగస్ట్ 12న తొలి కరోనా వ్యాక్సిన్ ని విడుదల చేస్తున్నట్లు రష్యా దేశ ఉప ఆరోగ్య మంత్రి ఒలేగ్ గ్రిడ్నెవ్ తెలిపారు. శుక్రవారం ఉఫా నగరంలో క్యాన్సర్ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్పిన్ ను గమలేయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలో ఉంది. ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ ట్రయల్స్ చాలా ముఖ్యమైనవని ఆయన అన్నారు. వైరస్ బారిన పడిన వారిలో రోగ నిరోధక శక్తి పెరిగితే టీకా సురక్షితమైనదని గ్రిడ్నెవ్ స్పష్టం చేశారు. మొదట ఈ టీకాలు సీనియర్ సిటిజన్లకు, వైద్య నిపుణులకు అందిస్తామని చెప్పారు. జూన్ 18న క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని, మొత్తం 38 మంది వాలంటీర్లకు టీకా ఇవ్వగా వారందరికీ రోగనిరోధక శక్తి పెరిగిందని గ్రిడ్నెవ్ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story