అంతర్జాతీయం

అమెరికాలో ప్రతిష్టాత్మక స్థానం నుంచి రేసులో భారత్ సంతతికి చెందిన మహిళ

అమెరికాలో ప్రతిష్టాత్మక స్థానం నుంచి రేసులో భారత్ సంతతికి చెందిన మహిళ
X

అమెరికాలో ఈ ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వం సిద్దమవుతున్నాయి. తమ అభ్యర్థులను కూడా పార్టీలు ప్రకటిస్తున్నాయి. కాగా.. అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఓటర్లు ఎక్కువగా ప్రభావితం చూపిస్తారు. దీంతో అన్ని పార్టీలు భారత సంతతికి చెందిన పలువురిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ప్రకటిస్తారు. కాగా.. భారత సంతతికి చెందిన సారా గిడియాన్ అనే మహిళను మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థికగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదించారు. అమెరికాలో మైనే రాష్ట్రం నుంచి ఎక్కువ పోటీ ఉంటుంది. సారాకు రిపబ్లికన్ పార్టీ తరుపున సుసాన్ కాలిన్స్ పోటీగా ఉన్నారు. ఈ స్థానం నుంచి సుసాన్ కాలిన్స్ గెలుపుకు 44శాతం అవకాశం ఉండగా.. అదే స్థానంలో సారా రేసులో దిగడంతో ఈ లీడ్ 39కి పడిపోయింది. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో మైనే రాష్ట్రం ఒకటి. సారాను ఈ స్థానంలో నిలబడటంతో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. కాగా.. ఆలోచనాత్మక, అధిక అర్హత కలిగిన వారిని సెనెటర్ అభ్యర్థులుగా ఆమోదించడం గర్వంగా ఉందని ఒబామా ఈ సందర్భంగా విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఆమోదించిన

అభ్యర్థులందరూ ప్రజల కోసం పాటుపడతారని ఒబామా అన్నారు.

Next Story

RELATED STORIES