సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తుపై రియా మండిపాటు

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తుపై రియా మండిపాటు

సుశాంత్ హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీబీఐ రంగంలోకి దిగడంతో రియా చౌదరి అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆమెను నిందితురాలుగా ఉన్న ఆమె.. ఈ కేసుకు సంబంధించి తాను సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని.. ఆ విచారణ పూర్తి కాక ముందు సీబీఐ రంగంలోకి దిగడాన్ని తప్పుపట్టింది. ఇది పూర్తిగా చట్ట విరుద్దమని.. న్యాయ సూత్రాలకు అతీతమని అసహనం వ్యక్తం చేశారు. కాగా జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని బాంద్రాలో గల నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. ముందుగా ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా.. డిప్రషన్ తోనే ఆత్మహత్య చేసుకున్నారని తేల్చారు. అయితే, సుశాంత్ తండ్రి ఫిర్యాదుతోబీహార్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. తాజాగా.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కలిసిన సుశాంత్ తండ్రి ఈ కేసును సీబీఐకి అప్పగించమని కోరారు. దీంతో నితీష్ సిఫారుసుల మేరకు ఈ కేసును విచారంచేందుకు కేంద్రం సీబీఐను రంగంలోకి దించింది.

ఇదిలా ఉండగా.. బీహార్ పోలీసులు సుశాంత్ తో సహజీవనం చేసిన రియా చక్రవర్తే అతడిని ఆత్మహత్యకు పురిగొల్పిందన.. డబ్బు తీసుకొని మోసం చేసిందని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బీహార్ పోలీసులు తనపై కేసు నమోదు చేయడంతో రియా చక్రవర్తి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును బీహార్ పోలీసుల నుంచి ముంబై పోలీసులకు అప్పగించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రియుడు చనిపోయిన బాధలో ఉన్న తనను చాలా మంది వేధిస్తున్నారని.. బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పిటిషన్ లో తెలిపారు. అయితే, ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఈ కేసును సీబీఐకు అప్పగించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

కాగా, గతంలో ఆమె సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను సోషల్ మీడియా వేదికగా కోరిన విషయం తెలిసిందే. అయితే, ప్రసుత్తం ఆమె ఈ విధంగా స్పందించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags

Next Story