ప్రగతి భవన్ ముట్టడికి విపక్ష నేతల యత్నం

ప్రగతి భవన్ ముట్టడికి విపక్ష నేతల యత్నం
X

హైదరాబాద్ ప్రగతి భవన్ ను ముట్టడించాలని విపక్ష నేతలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కరోనానుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడాలి అంటూ వారంతా డిమాండ్ చేశారు. శ్వేతసౌధం ముందు నల్లజాతీయులు నిరసన కోసం అవకాశం ఇచ్చినా.. తెలంగాణ కోసం కొట్లాడిన వారికి ప్రగతి భవన్ ముందు నిరసన తెలిపే అవకాశం లేదు అంటూ ఆందోళన చేశారు..

ప్రభుత్వం వెంటనే కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చి చికిత్స అందించాలని వారు డిమాండ్ చేశారు. పెద్దసంఖ్యలో విపక్ష నేతలు రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎక్కడికెక్కడ విపక్ష నేతలను అరెస్ట్ చేశారు. సిపిఐ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషా సహా నలుగురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

Tags

Next Story