చైనాకు ట్రంప్ మరోషాక్.. టిక్‌టాక్ నిషేధం

చైనాకు ట్రంప్ మరోషాక్.. టిక్‌టాక్ నిషేధం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు గట్టి షాక్ ఇచ్చారు. చెప్పింది చెప్పినట్టు చేశారు. టిక్ టాక్ ను నిషేధిస్తామని ఇటీవల ప్రటిచించిన ట్రంప్.. తాజాగా టిక్‌టాక్ తో పాటు.. వుయ్‌చాట్ ను కూడా నిషేధం విధిస్తున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందనే అనుమానంతో ఈ యాప్స్ ను నిషేధం విధిస్తున్నామని తెలిపింది. 45 రోజుల్లో ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. జాతి భద్రత దృష్ట్యా టిక్‌టాక్ యాజమాన్యంపై దూకుడుగా చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో టిక్‌టాక్‌పై నిషేధానికి కారణాలను వివరంగా తెలిపారు. టిక్‌టాక్ యూజర్ల సమాచారాన్ని, ఇంటర్నెట్ ప్రొవైడర్ సమాచారాన్ని, నెట్‌వర్క్ కార్యకలాపాలను, బ్రౌజింగ్, సెర్చ్ హిస్టరీలను ఆటోమేటిక్‌గా తెలుసుకుంటోందని.. ఇలా డేటాను సేకరించడం వల్ల అమెరికన్ల వ్యక్తిగత సమాచారానికి ముప్పు వాటిల్లుతోందని అమెరికా చెప్పింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమాచారాన్ని అంతటినీ తెలుసుకుంటోందని అమెరికా ఆరోపించింది.

Tags

Read MoreRead Less
Next Story