కేరళలో విమాన ప్రమాదం.. 14 మంది మృతి

కేరళలో విమాన ప్రమాదం.. 14 మంది మృతి

కేరళలో జరిగిన విమాన ప్రమాదంలో 14మంది మరణించారు. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 174 మంది ప్రయాణీకులు, 10 మంది శిశువులు, ఐదుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే, సంఘటనా స్థలంలోనే ఓ పైలట్ మృతి చెందగా.. 123 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరో 13 మంది మృతి చెందగా.. మృతులు సంఖ్య 14కి చేరింది. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కాగా.. ఈ ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్యం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది.

Tags

Next Story