ట్రంప్ మొండి వాదన.. 293మంది అమెరికన్లు మృతి

ట్రంప్ మొండి వాదన.. 293మంది అమెరికన్లు మృతి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొండి వాదన.. సుమారు మూడువందల మంది ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా మహమ్మారికి హైడ్రాక్సీ‌క్లోరోక్వీన్ అద్భతంగా పని చేస్తుందని ట్రంప్ వాదించారు. కరోనా చికిత్సలో బాగంగా ఈ మలేరియా మెడిసిన్ వాడటంతో 293మంది చనిపోయారని ‘మిల్వాకీ జర్నల్ సెంటినెల్’ అధ్యయనంలో తేలింది. ఈ మెడిసిన్‌ను ట్రంప్ భారత్ నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. దీంతో అమెరికాలో దీని వాడకం విపరీతంగా పెరిగింది. చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చిరించినా పట్టించుకోలేదు. దీనిని వాడటం వలన వచ్చిన నష్టం లేదని ట్రంప్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఈ మెడిసిన్ తాను కూడా వాడుతున్నాని ట్రంస్ స్వయంగా ప్రకటించారు. అధ్యక్షుడి మద్దతు లభించడంతో వైద్యులు కూడా కరోనా రోగులుకు హెసీక్యూను రిఫర్ చేశారు. దీంతో మార్చి నెలలో అమెరికాలో హైడ్రాక్సీక్లోరోక్వీన్ వినియోగం 20 రెట్లు పెరిగింది. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అమెరికాలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల చనిపోయినవారి వివరాలు వెల్లడించింది. దీంతో ‘మిల్వాకీ జర్నల్ సెంటినెల్’ చేసిన పరిశోధనలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 293 మంది అమెరికన్‌లు చనిపోయారని తేల్చింది.

Tags

Read MoreRead Less
Next Story