అయోధ్యలో అమరవీరుల స్మారక చిహ్నాలు స్థాపించాలి: ఏబీఏపీ

అయోధ్యలో అమరవీరుల స్మారక చిహ్నాలు స్థాపించాలి: ఏబీఏపీ
X

అయోధ్యలో రామాయల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అఖిల భారత అఖాడా పరిషత్(ఏబీఏపీ) కొత్త డిమాండ్‌ తెరపైకి తెస్తుంది. రామాలయ నిర్మాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి.. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకునేలా వారి పేర్లతో స్మారక స్తంభాలు ఏర్పాటు చేయాలిన డిమాండ్ చేస్తున్నారు. అయోధ్యలో నిర్మాణం చేపడుతున్న రామాలయ ఆవరణతో పాటు ప్రయాగ్‌రాజ్ లో కూడా స్మారక చిహ్నాలను నెలకొల్పాలన ఏబీఏసీ ప్రకటించింది. దీనికోసం తీర్మాణం చేపించి.. యూపీ ప్రభుత్వంతో కేంద్రానికి పంపించాలని 13 హిందూ సాధు సంఘాల సమాఖ్య అయిన ఏబీఏపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా.. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని హిందూ సంఘాలు దశాబ్ధాలుగా ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాల్లో చాలా మంది మృతి చెందారు.

Tags

Next Story