టీవీ నటి ఆత్మహత్య..

టీవీ నటి ఆత్మహత్య..

ఎవరినీ నమ్మొద్దు.. అందరూ స్వార్థపరులే.. అని ఆత్మహత్య చేసుకున్న భోజ్‌పురి నటి రాసిన సూసైడ్ నోట్ సారాంశం. భోజ్‌పురి సినీ నటి అనుపమ పాథక్.. ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని మీరా రోడ్ ఏరియాలో అనుపామా పాథక్ (40) ఆదివారం ఆమె అద్దె ఫ్లాట్‌లో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బీహార్‌కు చెందిన ఎంఎస్ పాథక్ అనేక భోజ్‌పురి సినిమాలు, టీవీ షోలలో నటించారు.

ఆమె మరణానికి ఒక రోజు ముందు, ఆమె ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను మోసపోయానని, ఎవరినీ నమ్మలేకపోతున్నానని చెప్పారు. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నా సహాయం చేయగల స్నేహితులు లేరని ఆమె మాట్లాడారు. ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. ఒక స్నేహితుడు తన ద్విచక్ర వాహనాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె మోసపోయినట్లు పోలీసు అధికారి తెలిపారు. కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో డబ్బులు లేకపోవడం, చేసేందుకు పని లేకపోవడంతో ఆమె కలత చెందారని పోలీసులు పేర్కొన్నారు. "బై బై, గుడ్ నైట్" అని ఆమె చివరిగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారని పోలీస్ అధికారి తెలిపారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన దాదాపు రెండు నెలల తర్వాత అనుపమా పాథక్ మరణం మానసిక ఆరోగ్యంపై చర్చకు దారితీసింది. 34 ఏళ్ల సుశాంత్ జూన్ 14 న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్ మెంట్లో ఉరివేసుకున్నాడు. జూన్ 9 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఎత్తైన భవనంపై నుంచి దూకి మరణించింది. మే 15 న టీవీ నటుడు మన్మీత్ గ్రెవాల్ ముంబైలోని తన ఇంటిలో చనిపోయాడు. టెలివిజన్ నటుడు సమీర్ శర్మ (44) " క్యోంకి సాస్ భీ కబీ బహు థి " " లెఫ్ట్ రైట్ లెఫ్ట్ " లలో తన పాత్రల ద్వారా ప్రసిద్ది చెందారు. అతడు ఒంటరిగా నివసిస్తున్న సబర్బన్ మలాడ్ లోని తన ఇంటిలో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా వరుస ఆత్మహత్యలు బాలీవుడ్ ను ఆందోళనకు గురిచేస్తోంది.

Tags

Next Story