అసోంలో స్వల్ప భూకంపం

అసోంలో స్వల్ప భూకంపం

ఈశాన్య భారతదేశంలో ఇటీవల తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. కరోనాకు తోడు ఈ భూకంపాలు ఈశాన్య రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అసోంలో భూకంపం సంభవించింది. సోనిట్‌పూర్ ప్రాంతంలో శనివారం ఉదయం 5.26 గంల‌కు భూ ప్రకంపనలు ఏర్పాడ్డాయి. రిక్ట‌ర్‌స్కేలుపై 3.5 తీవ్ర‌తతో భూమి కంపించిందని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఇల్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.

కాగా.. ఉత్తర, ఈశాన్యభారత రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు సంభవించడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పైగా ఈ కరోనా కాలంలో ఈ భూకంపాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Tags

Next Story