కొత్తమందుతో కొలుకుంటున్న కొవిడ్ బాధితులు..

కొత్తమందుతో కొలుకుంటున్న కొవిడ్ బాధితులు..
X

కరోనా కట్టడికి ఏ మందు పనిచేసినా ఎంతో ఊరటనిస్తుంది. వైరస్ శ్వాస వ్యవస్థపై తీవ్రప్రభావం చూపుతున్నందున బాధితులు త్వరగా కోలుకునేందుకు కొత్త ఔషధం బాగా ఉపకరిస్తుందని వైద్య నిపుణులు గుర్తించారు. ఈ ఔషధం పేరు 'ఆర్ఎల్ఎఫ్-100'. ఈ ఔషధం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆధ్వర్యంలో రెండో దశ ప్రయోగ పరీక్షలు పూర్తి చేసుకుంటోంది. దీన్ని మొదట వెంటిలేర్లపై ఉన్న రోగులకు అందించగా.. మూడు రోజులకే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు గుర్తించారు. న్యూరోఆర్ఎక్స్ అనే స్వతంత్ర పరిశోధన సంస్థ దీన్ని తయారు చేసింది. ఊపిరితిత్తుల్లో చేరిన కరోనా వైరస్ పెరగకుండా ఈ ఔషధం సమర్ధవంతంగా అడ్డుకుంటుంది. వెంటిలేటర్లపై ఉన్న చాలా మంది రోగులకు న్యూమోనియా ఉనికిని త్వరగా తగ్గించడమే కాకుండా బ్లడ్ లో ఆక్సిజన్ స్థాయిని కూడా ఇది మెరుగుపరుస్తుంది.

Tags

Next Story