పైలట్ ని కోల్పోయిన దుఖంలో వృద్ధ తల్లిదండ్రులు

పైలట్ ని కోల్పోయిన దుఖంలో వృద్ధ తల్లిదండ్రులు

విమాన ప్రమాదంలో కొడుకుని కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులు. ఇంతకు ముందు ఒక కొడుకు కూడా ఇలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని ఇప్పుడు మరో కొడుకు అదే రీతిన ప్రాణాలు కోల్పోవడం ఈ వయో భారంలో ఎలా తట్టుకునేది అని శోకిస్తున్నారు. సహాయం కోరివచ్చిన వారిని ఆదుకునే గుణమున్న మంచి వ్యక్తి అని కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కోజికోడ్ విమాన ప్రమాదంలో పైలట్ సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. విమాన ప్రమాదంలో మంటలు చెలరేగినట్లైతే మరింత ప్రాణ నష్టం జరిగేదని, పైలట్ సాథే ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ప్రయాణీకుల ప్రాణాలను కాపాడరని విమాన అధికారులు అంటున్నారు. 'వందే భారత్' మిషన్ కింద పనిచేస్తున్న ఈ విమానం కోజికోడ్ విమానాశ్రయంలోని టేబుల్‌టాప్ రన్‌వేపై నుంచి దిగడానికి ప్రయత్నించింది. అయితే కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విమానం రెండు సార్లు ల్యాండ్ అవడానికి ప్రయత్నించినా కుదరలేదు. దాంతో రన్ వేను ఢీకొట్టి పక్కనే ఉన్న లోయలో పడి విమానం రెండు ముక్కలైంది.

Tags

Next Story