ఉగ్రవాదుల రహస్యస్థావరం గుట్టురట్టు చేసిన జమ్మూకశ్మీర్‌ పోలీసులు

ఉగ్రవాదుల రహస్యస్థావరం గుట్టురట్టు చేసిన జమ్మూకశ్మీర్‌ పోలీసులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల రహస్య స్థావరాల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఫూంచ్ జిల్లా మంగనార్ ప్రాంతంలోని కల్సా అటవీప్రాంతంలో ఈ స్థావరాన్ని కనిపట్టారు. రహస్యస్థావరం ఉందనే సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ గ్రూపు జవాన్లు, సైనికులతో కలిసి గాలించారు. ఈ గాలింపులో ఉగ్రవాదుల రహస్య స్థావరం బయటపడింది. ఈ స్థావరంలో ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుదాలను ఉంచినట్టు తెలుస్తుంది. రెండు ఏకే -47 తుపాకులు, నాలుగు మేగజైన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేసిన ఈ ఆపరేషన్ లో ఓ కీలకమైన విషయాన్ని కనుక్కొన్నారు. పాకిస్థాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు కల్సా అటవీప్రాంతంలో రహస్య మార్గం ఉందని గుర్తించారు. దీనిపై జమ్మూకశ్మీర్ ప్రత్యేక పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story