ప్రేమ.. పెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ.. పెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి బెంగళూరు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లైన కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నారు. అంతలోనే మనస్పర్థలు.. ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించాయి. కామారెడ్డికి చెందిన శరణ్య అదే పట్టణానికి చెందిన తన తోటి విద్యార్థి రోహిత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. బెంగళూరులో కాపురం పెట్టారు. కాగా పెళ్లైన కొత్తలో బాగానే ఉన్న రోహిత్ ఆ తరువాత నుంచి రోజూ మద్యం సేవించి వచ్చి భార్య శరణ్యను కొట్టడం ప్రారంభించాడు. భర్త వేధింపులు భరించలేక శరణ్య ఈ మధ్యే తల్లిగారింటికి వచ్చింది. అయితే రోహిత్ అత్తగారింటికి వచ్చి భార్యను కొట్టను అని బతిమాలి, పెద్దలను ఒప్పించి మూడు నెలల కిందట ఆమెను మళ్లీ కాపురానికి తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో శరణ్య మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అల్లుడే కూతురిని చంపి ఉంటాడని లేదా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఉంటాడని శరణ్య తల్లి మాధవి ఆరోపిస్తోంది. రోహిత్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story