మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే మద్యం

మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే మద్యం

మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. ఆ రాష్ట్రమంత్రి ఈ విషయాన్ని తెలిపారు. మద్యం దుకాణాలకు హో డెలివరీ చేయడానికి లైసెన్సులు జారీ చేస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. దీనికి సంబందించిన మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం ఒక ఆర్డర్‌పై మూడు లీటర్ల మద్యం, నాలుగు లీటర్ల బీర్‌ కన్నా ఎక్కువ సరఫరా చేయకూడదని తెలిపారు. మరోవైపు మద్యం ఆర్డర్ చేసే వారి వయసు 20 ఏళ్లు దాటి ఉండాలని.. దీనికి తగ్గట్టు పత్రాలను ముందుగా సమర్పించాలని అన్నారు. తప్పుడు పత్రాలు సమర్పిస్తే.. కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది.

Tags

Next Story