టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై మరో మూడు కేసులు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై మరో మూడు కేసులు

కడప జిల్లా జైలునుంచి విడుదల అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో మూడు కేసులు నమోదు అయ్యాయి. కడప జైలునుంచి ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అనుచరులతో కలిసి అనంతపురం బయలుదేరారు. ఈ సమయంలో వారు కోవిడ్ నిబంధనలు అతిక్రమించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడితో ఆగకుండా తాడిపత్రి సిఐ దేవేందర్ రెడ్డిపై ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని..

రెండు కేసుల తోపాటు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు కేసులు పెట్టామంటున్నారు పోలీసులు. దీనిపై జేసీ అనుచరులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయంగా కక్షసాధించేందుకే ఇలా అక్రమ కేసులు పెట్టారని కోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా తమపై వేధింపులకు దిగడం ఏమిటి అని జేసీ కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story