అగ్ని ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు : ఆళ్ల నాని

అగ్ని ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు : ఆళ్ల నాని

కరోనా పేషెంట్లకు చికిత్స అందించడం కోసం విజయవాడలో ప్రైవేట్‌ ఆసుపత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో తెల్లవారుజామున 4:45 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ఇప్పటివరకూ 10 మంది మృతి చెందినట్టు అధికారికంగా తెలియవచ్చింది.

మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరోవైపు ఈ ఘటన బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 48 గంటల్లో కమిటీని నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు చెప్పారు.

Tags

Next Story