ఏపీలో కరోనా టెర్రర్.. మరోసారి పదివేలకు పైగా కేసులు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 62,123 శాంపిల్స్ ను పరీక్షించగా 10,080 మందికి కోవిద్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల గుంటూరు లో పద్నాలుగు మంది. అనంతపూర్‌ లో పదకొండు మంది, కర్నూల్‌ లో పది మంది, పశ్చిమ గోదావరి లో పది మంది. చిత్తూర్‌ లో ఎనిమిది మంది, నెల్లూరు లో ఎనిమిది మంది, ప్రకాశం లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు,

విశాఖపట్నం లో ఐదుగురు, విజయనగరం లో ఐదుగురు, కృష్ణ లో నలుగురు, కడప లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 9,151 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,14,145 పాజిటివ్ కేసులకు గాను.. 1,26,720 మంది డిశ్చార్జ్ కాగా..1,939 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,486 గా ఉంది.

Tags

Next Story