జ్యోతిక పెద్దమనసు.. ప్రభుత్వాసుపత్రికి నగదు సాయం

తమిళ నటి జ్యోతిక ప్రభుత్వాసుపత్రికి పెద్ధమొత్తంలో సాయం అందించారు. జ్యోతిక ఆ మధ్య ఓసారి అవార్డ్ ఫంక్షన్ల వేదిక మీద ఆలయాల నిర్వహణ కోసం అంత పెద్ధ మొత్తంలో ఖర్చుచేసేబదులు ఆపన్నులను ఆదుకోవడానికి ఖర్చుపెడితే మంచిది కదా అని తన మనసులోని భావాలను వ్యక్త పరిచి అర్చకుల ఆగ్రహానికి గురయ్యారు. జ్యోతిక భర్త సూర్య కూడా భార్య మాటలకు కట్టుబడే ఉన్నారు. ఆమె అన్నదాంట్లో తప్పు ఎంత మాత్రం లేదన్నారు. అయితే జ్యోతిక తనను విమర్శించే వారి నోటిని కట్టడి చేసేందుకు తానే స్వయంగా తంజావూరు ప్రభుత్వాసుపత్రికి రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రికి అవసరమైన ఆధునిక పరికరాలు, అదనపు సౌకర్యాల మెరుగుదల కోసం రూ.25 లక్షల విరాళాన్ని అందించింది. ఈ మొత్తాన్ని ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ కి అందించారు. జ్యోతిక చేసిన మంచి పనికి రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com