శ్రీశైలంలోకి మళ్ళీ భారీగా వరదనీరు

శ్రీశైలంలోకి మళ్ళీ భారీగా వరదనీరు
X

దాదాపు వారం రోజులు గ్యాప్ ఇచ్చిన కృష్ణమ్మ మళ్ళీ బిరబిరా పరుగులు తీస్తోంది. ఎగువన విపరీతంగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. శనివారం సాయంత్రం శ్రీశైలంలోకి 98,765 వేల క్యూసెక్కులు వచ్చాయి.. అయితే ఇది రాత్రి 12 గంటలకు రెండు లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తుండడంతో సాగర్‌లో నీటి మట్టం 558.20 అడుగులకు చేరింది.

Tags

Next Story