రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల

రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల

ఏపీలో సోమవారం 2020-23 పారిశ్రామిక విధానానికి సంబంధించి నూతన ఇండస్ట్రియల్ పాలసీని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నూతన పాలసీని విడుదల చేస్తారని చెప్పారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇదిలావుంటే వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తవుతున్నా ఇంతవరకూ పారిశ్రామిక విధానం ప్రకటించకుండా ఉండకపోవడం చర్చనీయాంశం అయింది.

Tags

Read MoreRead Less
Next Story