కరోనాతో 196 మంది వైద్యులు మృత్యువాత

కరోనాతో 196 మంది వైద్యులు మృత్యువాత

దేశంలో కరోనా మృతుల సంఖ్య 42 వేలకు పైగా నమోదైంది. కరోనా పేషెంట్లకు ప్రాణాలొడ్డి వైద్యం అందించే రోగులు సైతం మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు 196 మంది డాక్టర్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శనివారం ప్రకటించింది. డాక్టర్ల ఆరోగ్యం పై కూడా ప్రధాని మోదీ దృష్టి సారించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. కరోనా బారిన పడుతున్న వైద్యుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో అన్ని విభాగాల్లో పని చేసే వైద్యులతో పాటు వారి కుటుంబాలకు జీవిత బీమా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ ఈ మేరకు ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story