ఆకట్టుకుంటున్న గుడిలో సెన్సార్ గంట

ఆకట్టుకుంటున్న గుడిలో సెన్సార్ గంట

కరోనావైరస్ మనుషుల మధ్య చాలా మార్పులు తెచ్చింది. మనుషుల మధ్య దూరం పెంచింది. ఏదైనా ముట్టుకోవాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ఆలయాలు కూడా మినహాయింపు కాదు. కరోనా నేపథ్యంలో ఆలయాల్లో తీర్ధ ప్రసాదాలు రద్దు చేశారు. అయితే గుడికి వెళ్ళగానే గుడిలో భక్తులు తప్పక చేసే పని గుడిలో గంట మోగించడం. వైరస్ వ్యాప్తితో గుడిగంట కొట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి.. దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు కాస్త కొత్తగా ఆలోచించారు.

మధ్యప్రదేశ్ లోని మాదసూర్ ప్రాంతంలో ఉన్న పశుపతి దేవాలయంలోని గంటను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎవరు తాకకుండానే గంట కొట్టుకునే ఏర్పాటు చేశారు. ఈ గంట సెన్సార్ సహాయంతో పనిచేస్తుంది. ఈ కరోనా కాలంలో అధికారులు కాటాక్టు లెస్ గంటను ఏర్పాటు చెయ్యడంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story