మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూత

X
By - TV5 Telugu |10 Aug 2020 6:07 PM IST
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతిచెందారు.. గంత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాంబశివరాజు సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు రాజకీయంగా ఎదిగారు.
8సార్లు ఎంఎల్ఎ, ఒకసారి మంత్రిగా, శాసనసభలో రెండుసార్లు ప్రొటెమ్ స్వీకర్ గా , అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) కార్యదర్శిగా సాంబశివరాజు పనిచేశారు. గజపతినగరం, పతివాడ నియోజకవర్గాల నుంచి వరసగా 8 సార్లు ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. సాంబశివరాజు మృతిపట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com