ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

ప్రజాప్రతినిధులను కరోనా నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పలువురు మంత్రలు, ఎమ్మెల్యేలు కరోనా భారిన పడ్డారు. అందులో ఒకరిద్దరు మరణించారు. ఇక కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కోనసాగుతోంది. తాజాగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బి శ్రీరాములుకు కరోనా సోకింది. శనివారం శ్రీరాములుకు కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రికి ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారిని కూడా గుర్తించి కరోనా పరీక్షలు చేస్తున్నారు అధికారులు.

Tags

Next Story