ఏపీలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల

X
By - TV5 Telugu |10 Aug 2020 8:32 PM IST
ఏపీలో నూతన పారిశ్రామిక విధానాన్ని ఐటీ మరియు పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పారిశ్రామిక నూతన పాలసీ విడుదల చేశారు. ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ఈ పాలసీలో ప్రాధాన్యత ఇచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది.
కాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత నూతన పారిశ్రామిక విధానం ప్రకటించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వెనక్కి వెళ్లాయన్న అభిప్రాయం ప్రజల్లో ఉందంటున్నాయి ప్రతిపక్షాలు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com