రైతులకు లక్ష కోట్ల మౌలిక నిధి
X
By - TV5 Telugu |10 Aug 2020 1:30 PM IST
పంట ఉత్పత్తి తర్వాత రైతులకు అవసరమైన మౌలిక సదుపాయల అభివృద్ధికి.. రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధిని ప్రారంభించారు. ఈ లక్ష కోట్ల రూపాయల అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి
ఉపయోగించబడుతుంది. కోల్డ్ స్టోర్స్, గిడ్డంగులు, గోతులు, గ్రేడింగ్ మరియు ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఈ ఫండ్ రుణాలు అందిస్తుంది. కాగా, ఈ పథకం కోసం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ (పీఏసీఎ్‌స)ల ద్వారా రైతులకు నిధులు మంజూరు చేయనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com