మహేష్ బాబుకి అభిమానుల పుట్టిన రోజు కానుక..

అసలే కరోనా కాలం.. అందునా అభిమానులకు ముందే హెచ్చరించారు. నాకోసం మీరు ఏ కార్యక్రమాలూ చేపట్టవద్దు. మీరు సురక్షితంగా ఉండడమే మీరు నాకిచ్చే పెద్ద బహుమతి అని.. మరి మహేష్ అభిమానులు కదా.. ఆయన రేంజ్ కి తగ్గట్టు బహుమతి ఇవ్వాలి. అందుకు సోషల్ మీడియానే వేదిక చేసుకున్నారు. #HBDMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్ తో 60.2 మిలియన్ ట్వీట్లను చేశారు. ఇది ఇప్పటి వరకు ట్విట్టర్ లో ప్రపంచంలోనే అతి పెద్ద రికార్డు. మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు 1.28 లక్షల మందికి పైగా అభిమానులు పాల్గొన్నారు. ఇది కూడా ఓ సరికొత్త రికార్డు. ఈ సందర్భంగా విడుదలైన సర్కారు వారి పాట యొక్ చిత్రంలోని మోషన్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటోంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com