భారత్ లో నిన్న ఒక్కరోజే 4,77,023 పరీక్షలు

భారత్ లో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 62,064 కేసులు మరియు 1,007 మరణాలు నమోదు అయ్యాయి. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,074 కు పెరిగింది. ఇందులో 15,35,744 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6,34,945 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక మొత్తం మరణాల సంఖ్య 44,386 గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 9 వరకు పరీక్షించిన మొత్తం కరోనావైరస్ నమూనాల సంఖ్య 2,45,83,558 గా ఉంటే.. నిన్న ఒక్కరోజే 4,77,023 నమూనాలను పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది.

Tags

Next Story