ముబైల్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

తమిళనాడులో కరూర్ జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. ముబైల్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. ముత్తులక్ష్మీ అనే మహిళ ముబైల్ కు ఛార్జింగ్ పెట్టి.. ఆమె తన ఇద్దరు పిల్లలు పడుకున్నారు. అయితే, కొద్దిసేపటికి ముబైల్ మంటలు వచ్చాయి. మంటలతో పరుపు, బెట్ షీట్ అంటుకోవడంతో ముత్తులక్ష్మీ, ఇద్దరు పిల్లులు మొత్తం ముగ్గురూ పూర్తిగా కాలిపోయారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు పిల్లలు చనిపోగా.. తీవ్రంగా గాయపడిన ముత్తులక్ష్మీని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ముబైల్ చార్జింగ్ ఎక్కువ కావడంతో పేలిపోయిందని ప్రాథమిక విచారణ పోలీసులు తెలిపారు. కాగా.. ఒకే కుంటుంబంలో ముగ్గురు చనిపోవడంతో స్థానిక ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story