పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇవ్వలేం..

పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇవ్వలేం..

యూజీసీ ఫైనల్ ఇయర్ పరీక్షల రద్దుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యూజీసీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడారు. డిగ్రీలు ప్రధానం చేసే ప్రక్రియలో నియమాలను రూపొందించే హక్కు కేవలం యూజీసీకి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వాలు యూజీసీ నియమావళిని మార్చలేవన్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇవ్వలేమన్నారు. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 14కు వాయిదా వేసింది. కోవిడ్ నేపథ్యంలో యూజీసీ ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలని ఇటీవల మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం పట్ల స్పందించేందుకు యూజీసీకి సుప్రీం కొంత గడువును ఇచ్చింది. అశోక భూషన్, సుభాష్ రెడ్డి, షాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. సెప్టెంబర్ 30 లోగా పరీక్షలు నిర్వహించాలని గతంలో యూజీసీ చెప్పింది. విద్యార్థులు పరీక్షలు రాయనంతవరకు వారికి డిగ్రీలు ఇవ్వలేమని యూజీసీ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story