సకాలంలో బీహార్ ఎన్నికలు నిర్వహిస్తాం: ఈసీ

సకాలంలో బీహార్ ఎన్నికలు నిర్వహిస్తాం: ఈసీ

బీహార్ ఎన్నికలను సకాలంలోనే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓ వైపు కరోనా సంక్షోభం, మరోవైపు వరదల ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని.. ఈ సమయంలో ఎన్నికలు వాయిదావేయాలని ప్రతిపక్షాలు కోరాయి. ఈ నేపథ్యంలో ఛీప్ ఎలక్షన్ కమిషనర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా వ్యాప్తికి ఏమాత్రం అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, రాష్ట్రీయ జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరాయి. ప్రజల భద్రత ముఖ్యమని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించవద్దని కాంగ్రెస్ నాయకుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ కోరారు. బీహార్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు మంగళవారం గడువు విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. నవంబరు 29వతేదీతో బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.

Tags

Next Story