ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్

ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్

కరోనావైరస్ కు వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో రష్యా విజయవంతం అయిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. వ్యాక్సిన్ పై పుతిన్ ఇలా అన్నారు.. 'మేము కరోనాకు సురక్షితమైన వ్యాక్సిన్ తయారు చేశాము..దేశంలో కూడా నమోదు అయింది.. నా కుమార్తెకు మొదటి టీకా ఇచ్చాము.. ఈ టీకా ప్రణాళిక ప్రకారం రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు రెగ్యులేటరీ బాడీ నుండి అనుమతి పొందింది.

ఈ వ్యాక్సిన్ గామ్-కోవిడ్-వాక్ లియోను రక్షణ మంత్రిత్వ శాఖ మరియు గమాలయ నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి టీకా' అని పేర్కొన్నారు. సెప్టెంబర్ నుండి దీనిని ఉత్పత్తి చేయడానికి మరియు అక్టోబర్ నుండి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story