లెబనాన్‌ ప్రధాని రాజీనామా

లెబనాన్‌ ప్రధాని రాజీనామా

లెబనాన్‌ ప్రధాని హసన్‌ దియాబ్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. బీరూట్ లో పేలుళ్ల కారణంగా దాదాపు 200 మంది మరణించగా, 6,000 మంది గాయపడ్డారు.. బీరూట్ లో భారీ పేలుడు అనంతరం నైతిక బాధ్యత వహిస్తూ.. దాదాపు ఒక వారం తరువాత తన రాజీనామా ప్రకటించారు

ప్రధాని. ఆయనే కాకుండా లెబనాన్ న్యాయ మంత్రి మేరీ క్లాడ్ నజ్మ్, సమాచార మంత్రి మనల్ అబ్దేల్ సమద్, పర్యావరణ మంత్రి డామియానోస్ కత్తార్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మాట్లాడిన హసన్ ‘ఇక్కడ ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలింది’ అని వ్యాఖ్యానించారు. ఇకపై ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాటం చేస్తానని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story