ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు

మహారాష్ట్రలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 వరకూ.. లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటిచింది. రోజువారి కరోనా కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా.. కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని.. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పూణే, ముంబై, సోలాపూర్, మాలేగావ్, ఔరంగాబాద్, నాసిక్, ధులే, జల్‌గావ్, అకోలా, అమరావతి, నాగ్‌పూర్‌లలో లాక్‌డౌన్ పొడిగించనున్నట్లు ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్ అమల్లో ఉన్నా.. ప్రజల అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు తెరిచే ఉంటాయని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే రెస్టారెంట్లు, సినిమా థియేటర్లకు మాత్రం అనుమతిలేదని ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com