ప్రముఖ కవి రహత్‌ ఇందోరి కన్నుమూత

ప్రముఖ ఉర్దూ కవి రహత్ ఇందోరి మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రహత్ ఇందోరి మధ్యప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కాగా చికిత్స సమయంలో ఆయనకు రెండు సార్లు గుండెపోటు వచ్చినట్లు ఇండోర్‌లోని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

అనారోగ్యం దానికి తోడు కరోనా పాటిజివ్‌గా రావడంతో ఆదివారం ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. అయితే గుండెపోటు రావడంతో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కాగా తన ఆరోగ్యంపై సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తానని రహత్‌ ఇందోరి ట్వీట్‌ చేసిన కొద్దిసమయానికే ఆయన మరణించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story