ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన యడియూరప్ప

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన యడియూరప్ప

కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడిన ఆయన ఆగస్టు2న ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన ఆస్పత్రిలో చేరినప్పటికీ.. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అక్కడ నుంచే విధులు నిర్వహించేవారు. తాజాగా మరోసారి యడియూరప్ప కరోనా పరీక్ష జరిపించుకోగా.. ఆయనకు నెగిటివ్ అని తేలింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. కర్నాటక హెల్త్ మినిష్టర్ కూడా కరోనా బారినపడ్డారు. అటు, కర్నాటక ప్రతిపక్ష నేత సిద్ధారామయ్యకు కరోనా పాటిజివ్ అని తేలింది. మరోవైపు దేశంలో చాలా మంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతన్నారు. హోంమంత్రి అమిత్ షా సహా.. ఇప్పటివరకూ నలుగురు కేంద్ర మంత్రులుకు కరోనా సోకింది.

Tags

Read MoreRead Less
Next Story