రష్యా వ్యాక్సిన్‌పై కీలకవ్యాఖ్యలు చేసిన ఎయిమ్స్ డైరక్టర్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కరోనా మొదటి వ్యాక్సిన్ సిద్దమైందని తెలిపారు. అయితే, ఈ వ్యాక్సిన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీకాకు సంబంధించిన దుష్ప్రభావాలను పరీశీలించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. వైరస్ పై ఈ వ్యాక్సిన్ ఎంత వరకూ ప్రభావం చూపిస్తుందో.. అది సురక్షితమో కాదో చూడాలని అన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోదక శక్తిని పెంచుతుందో లేదో చూడాలని అన్నారు. వీటిన్నింటి మీద స్పష్టత వస్తేనే ముందుకు సాగాలని సూచించారు. అన్ని బాగుంటే.. ఈ వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే సామర్ధ్యం భారతదేశానికి ఉందన్నారు. ఈ వ్యాక్సిన్ తయారీకి నిధులు అందిస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టెమెంట్ ఫండ్.. ఈ టీకాను భారతదేశం, దక్షిణ కొరియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, టర్కీ, క్యూబాలో ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పై డబ్ల్యూహెచ్‌వో కూడా సందేహాలు వ్యక్తం చేస్తుంది. ఈ టీకాకు సంబంధించి రష్యా అవసరమైన డేటాను తమతో పంచుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌వో ఆరోపించింది.
RELATED STORIES
Sunil: ఆ విషయంలో రాఘవేంద్ర రావు, అనిల్ రావిపూడి ఒకటే: సునీల్
25 May 2022 1:00 PM GMTThank You Teaser: లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకున్నాను: ...
25 May 2022 12:15 PM GMTRam Pothineni: రామ్ అప్‌కమింగ్ మూవీ ఫిక్స్.. ఏకంగా స్టార్...
25 May 2022 11:30 AM GMTAnanya Panday: మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన...
25 May 2022 10:15 AM GMTBindu Madhavi: బిందు మాధవి పెళ్లిపై తన తండ్రి ఇంట్రెస్టింగ్...
24 May 2022 2:39 PM GMTNaga Chaitanya: తమ్ముడికి హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో అన్న సినిమా..
24 May 2022 11:45 AM GMT