ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయని టెస్ట్ చేస్తే..

ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయని టెస్ట్ చేస్తే..
X

కరోనా వచ్చిందని కనిపించే లక్షణాలు కొన్నైతే.. కనిపించకుండా కూడా పాజిటివ్ చూపిస్తోంది. కొవిడ్ లక్షణాలైన దగ్గు, జ్వరం, ఆయాసం, కళ్లు ఎర్రబడడం వంటి వాటికి తోడు ఎక్కిళ్లు రావడం కూడా వైరస్ సోకిందని చెప్పడానికి కారణంగా చూపిస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. చికాగోకు చెందిన 62 ఏళ్ల వ్యక్తికి ఆగకుండా నాలుగు రోజులనుంచి ఎక్కిళ్లు వస్తున్నాయి. అతడికి మరే లక్షణాలూ కనిపింకపోయినా ఎక్కిళ్లకు తోడు జ్వరం కూడా రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఎందుకైనా మంచిదని వైద్యులు అతడికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ అని వచ్చింది.

దీన్ని బట్టి ఆగకుండా ఎక్కిళ్లు వస్తే అది కూడా కరోనా లక్షణంగా భావించాలని అమెరికన్ వైద్యులు చెబుతున్నారు. ఎక్కిళ్లు వచ్చిన వ్యక్తికి అంతకుముందు ఏ అనారోగ్య సమస్యలు లేవు. అయినా డాక్టర్లు మరిన్ని పరీక్షలు నిర్వహించగా అతడి ఊపిరితిత్తుల్లో వాపు వచ్చిఅవి చెడిపోయిన విషయాన్ని గుర్తించారు. ఒక ఊపిరితిత్తినుంచి రక్త స్రావం జరగడాన్ని కూడా గమనించారు. ఊపిరితిత్తుల్లో వాపు ఎక్కిళ్లకు కారణమైందని తెలుసుకున్నారు. వెంటనే వైద్యులు అతడిని ఎమర్జెన్సీ వార్డులో ఉంచి అజిత్రోమైసిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చారు. మూడు రోజుల అనంతరం అతడు కోలుకోగా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.

Tags

Next Story